: మనుషులను చదవడం అప్పుడే మొదలుపెట్టాను: పవన్ కల్యాణ్


తాను చదువుకొనేటప్పుడు జరిగిన ఘటనను ‘జనసేన’ సభలో పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. తాను ఏడో తరగతిలో ఉండగా సాయంత్రం పూట వన్ వే లో వెళ్లిన కారణంగా పోలీసులు తనను స్టేషనుకు తీసుకెళ్లారన్నారు. నిజానికి అప్పుడు తనకు ట్రాఫిక్ రూల్స్ కూడా సరిగా తెలియవన్నారు. పీఎన్ లో చాలా సేపు.. అంటే రాత్రి సమయం వరకు తనను ఉంచేశారని పవన్ చెప్పారు. తర్వాత ఇంటికెళ్లాక కుటుంబ సభ్యులు కూడా తనను మందలించారని ఆయన అన్నారు. అయితే ఆ సంఘటన తర్వాత తనకు చదువు మీద ఆసక్తి పోయిందన్నారు. కానీ, మనుషులను చదవడం మాత్రం అప్పుడే మొదలుపెట్టానని ఆయన చెప్పారు. అభిమానులతో తన భావాలను పంచుకుంటూ... నవ్వుతూ ఆయనీ ఘటనను ఉదహరించారు.

  • Loading...

More Telugu News