: పవన్ అభిమానులపై లాఠీ చార్జ్
హైదరాబాదులోని హైటెక్స్ వద్ద పవన్ కల్యాణ్ అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, పవన్ ఫ్యాన్స్ కు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మాదాపూర్ లోని నోవాటెల్ లో మరికాసేపట్లో జనసేన సభ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సభకు పవన్ అభిమానులు వెల్లువెత్తుతున్నారు.