: బీచ్ చెంత అనుష్క, కోహ్లీ రొమాన్స్!


ఒకసారి ప్రేమలో పడితే దూరంగా ఉండటం ప్రేమికుల వల్ల కాదు. ప్రస్తుతం బాలీవుడ్ లో అదే జరుగుతోంది. తమ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా కొన్ని రోజుల కొకసారైనా వీలు చూసుకుని కలుసుకుంటున్నారు. ఐదు రోజుల కిందట రణబీర్ కపూర్ కోసం కత్రినా కైఫ్ శ్రీలంక వెళితే, ప్రస్తుతం నటి అనుష్క శర్మ కోసం క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఇలానే చేశాడు. ఈ అమ్మడు 'బాంబే వెల్వెట్' చిత్రం షూటింగులో లంకలో బిజీగా ఉంది. దాంతో, బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ కు వెళ్లేముందు ఒకసారి తన ప్రియురాలిని చూసేందుకు కోహ్లీ లంక చెక్కేశాడట. అక్కడి బీచ్ లో ఇద్దరు చాలా సమయం గడిపి, ఓ హోటల్లో కలిసి డిన్నర్ కూడా చేశారట. ఎవరికైనా కనపడతామేమోనని చాలా తెలివిగా తిరిగారట వీరిద్దరూ. రెండు నెలల కిందట న్యూజిలాండ్ లో ఉన్న కోహ్లీ కోసం అనుష్క వెళ్లటం, వారిద్దరూ జంటగా ఉన్న ఓ ఫోటో నెట్ లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News