: వైఎస్సార్సీపీ బొమ్మ పార్టీ: పయ్యావుల
వైఎస్సార్సీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్సీపీ జైలుకు పోయే పార్టీ అని ఎద్దేవా చేశారు. టీడీపీ మాత్రం సచివాలయానికి వెళుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పరోక్షంగా కాంగ్రెస్ కు ఓటేసినట్లేనన్నారు. అమ్మ పార్టీ కాంగ్రెస్ అయితే, బొమ్మ పార్టీ వైఎస్సార్సీపీ అని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జగన్ ఆస్తుల కేసుల విచారణ అంతా సంవత్సరంలోపు పూర్తి కావాలని అనంతపురంలో ఓ కార్యక్రమంలో చెప్పారు. మరి విచారణ సమయంలో జగన్ ప్రజా సేవ చేస్తారా? కోర్టుల చుట్టూ తిరుగుతారా? అని ప్రశ్నించారు.