: ‘‘ఆ విమానంలో 13 కిలోల పుత్తడి ఉంది... పట్టుకోండి’’
శంషాబాద్ నుంచి ముంబై వెళ్లిన జెట్ ఎయిర్ వేస్ విమానంలో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా 13 కిలోల బంగారాన్ని తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. అయితే, అప్పటికే ఆ విమానం గాల్లోకెగిరింది. దీంతో, వెంటనే ఈ సమాచారాన్ని ముంబై విమానాశ్రయాధికారులకు అందించారు. ముంబైలో విమానం దిగగానే బంగారం స్వాధీనం చేసుకోవాలని వారు సూచించారు. ఈ నేపథ్యంలో బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరినీ అక్కడి కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.