: బీజేపీకి మద్దతుపై పునరాలోచిస్తా: బాబా రాందేవ్


బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించినప్పటి నుంచీ ఆ పార్టీకి విపరీతంగా మద్దతు తెలుపుతున్న యోగా గురువు బాబా రాందేవ్ అకస్మాత్తుగా యు టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు మాట్లాడిన ఆయన, తానెవరికీ బానిసను కానని... ఎన్డీఏ, బీజేపీలకు మద్దతుపై పునరాలోచిస్తానని చెప్పారు. రాజకీయాల్లో పలు ప్రత్యామ్నాయాలు లేవని, సమస్య ఆధారంగానే ఎప్పుడూ తమ మద్దతు ఉంటుందని రాందేవ్ చెప్పారు. ప్రస్తుతం ఎన్డీఏలో చాలా గందరగోళం నెలకొని ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాందేవ్ అవినీతి, నల్లధనంపై దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News