: లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తా: దర్శకుడు శంకర్
తెలంగాణ ప్రాంతానికి చెందిన దర్శకుడు ఎన్.శంకర్ రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెన్నైలో తెలిపారు. కొద్ది రోజుల్లో తన రాజకీయ రంగ ప్రవేశంపై అధికారికంగా ప్రకటిస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీకి నిలవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ విషయంపై ఇంకా ఆ పార్టీ నేతలతో మాట్లాడలేదన్నారు. త్వరలో 'తెలంగాణ సినీ ఫోర్స్' అనే కమిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.