: కృష్ణా ట్రైబ్యునల్ కేసు విచారణ వాయిదా
కృష్ణా ట్రైబ్యునల్ కేసు విచారణను సుప్రీంకోర్టు జులై మూడో వారానికి వాయిదా వేసింది. ఈ కేసుపై ఈరోజు (శుక్రవారం) ఉదయం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ట్రైబ్యునల్ తీర్పులో జోక్యం చేసుకోరాదన్న మహారాష్ట్ర వాదనను ‘సుప్రీం’ కొట్టివేసింది. అలాగే టీడీపీ నేత దేవినేని ఉమాతో పాటు పలువురు రైతులు వేసిన పిటిషన్లనూ ధర్మాసనం తోసిపుచ్చింది. అవసరమైతే మధ్యలో రైతులు జోక్యం చేసుకొని తమ వాదనలు వినిపించవచ్చని కోర్టు తెలిపింది. అయితే రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాతే పిటిషన్ పై విచారణ జరపాలన్న కర్ణాటక వాదనలను ‘సుప్రీం’ సమర్థించింది.