: ఉప్పల్ లో పెట్రోల్ బంకును మూసేశారు
గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని ఉప్పల్ లో పెట్రోల్ బంకును మూసేశారు. ఆ పెట్రోల్ బంకులో తూనికలు, కొలతల శాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. నాణ్యమైన పెట్రోలును సరఫరా చేయడం లేదంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈరోజు (శుక్రవారం) పెట్రోల్ బంకును తూనికలు, కొలతల అధికారులు సీజ్ చేశారు.