: పవన్ కల్యాణ్ మాటలు విన్నాక నిర్ణయిస్తా: పోసాని కృష్ణమురళి


పవన్ కల్యాణ్ మాటలు విన్నాకే ఆయనకు ఓటేయాలో లేదో నిర్ణయిస్తానని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తాను రాజకీయ సన్యాసం తీసుకున్నానని, ఇకపై ఏ పార్టీలో చేరనని అన్నారు. చిరంజీవి అంటే ఉన్న అభిమానంతోనే తాను పార్టీలో చేరానని, ఒక్క రూపాయి పంచకుండా ఎన్నికల్లో పాల్గొన్నానని పోసాని తెలిపారు. ఇప్పటికీ పీఆర్పీ ఉంటే పోటీ చేసేవాడినని పోసాని తెలిపారు.

తాను మరో పార్టీలో చేరే అవకాశం లేనందున ఓటేస్తానని ఆయన అన్నారు. తనకు అందరూ ఒకటేనని, చంద్రబాబైనా, జగన్ అయినా బాగా పరిపాలిస్తారనిపిస్తే వారికే ఓటేస్తానని ఆయన తెలిపారు. పవన్ కల్యాణ్ మాటలు, ప్రజలకు ఆయన చేస్తాననే సేవపై పూర్తి అవగాహన వచ్చిన తరువాత దానిపై స్పందిస్తానని తెలిపారు.

సరైన పరిపాలన అందించగలడా?, హామీలు నెరవేర్చగలడా?, విశ్వసనీయత ఉందా? లేదా?, గతంలో ఇచ్చిన హామీలను గాలికొదిలేశాడా? వాటిని నెరవేర్చాడా? అనే విషయాలను చూస్తానని, నిరుద్యోగ సమస్యపై, ప్రజా సమస్యలపై అవగాహన ఉండి పరిష్కారానికి కృషి చేయగలడా? లేదా? అని ఓ ఓటరుగా చూస్తానని పోసాని కృష్ణమురళి తెలిపారు. తనకు నమ్మకం కుదిరితే ఓటేస్తానని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News