: 2,500 మార్కుకి చేరిన చంద్రబాబు
వస్తున్నా మీకోసం.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేటికి రెండు వేల ఐదువందల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ఇప్పటికి 175 రోజుల పాటు సాగిన చంద్రబాబు పాదయాత్ర 15 జిల్లాల మీదుగా నడిచింది. ఇందులో ఆయన 72 నియోజకవర్గాలు, 143 మండలాలు, 24 మున్సిపాల్టీలు, 3 కార్పొరేషన్లలో పర్యటన సాగించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తోన్న బాబు మండపేట వద్ద 2,500 కిలోమీటర్ల మార్కును చేరుకున్నారు.