: పవన్ కల్యాణ్ 'జనసేన' సభపై పోలీసుల ఆంక్షలు
సినీ నటుడు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో మాదాపూర్ నోవాటెల్ హోటల్ లో నిర్వహించనున్న 'జనసేన' పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణపై సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. సభను సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల్లోపు ముగించాలని సైబరాబాద్ డీసీపీ క్రాంతిరాణా టాటా ఆదేశించారు. పాసులు ఉన్నవారినే సభకు అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇతరులకు ప్రవేశం నిషిద్ధమని, అందరూ సహకరించాలని ఆయన పవన్ కల్యాణ్ అభిమానులకు సూచించారు.