: పవన్ కల్యాణ్ సభకు పోలీసుల అనుమతి
సినీ హీరో పవన్ కల్యాణ్ కొత్త పార్టీకి సంబంధించి శుక్రవారం నాడు హైదరాబాదులో నిర్వహించే సభకు పోలీసుల అనుమతి లభించింది. పవన్ కల్యాణ్ సభకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు మాదాపూర్ డీసీపీ క్రాంతిదేవ్ రాణా తెలిపారు. పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ బార్ కోడ్ ఉన్న 3 వేల పాసులను జారీ చేసిందని ఆయన చెప్పారు. ఈ పాసులున్న వారినే సమావేశానికి అనుమతించనున్నట్టు ఆయన తెలిపారు.