: టీడీపీ గూటికి మాకినేని పెదరత్తయ్య
మాజీ మంత్రి డాక్టర్ మాకినేని పెదరత్తయ్య టీడీపీ గూటికి చేరారు. గుంటూరు జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న పెదరత్తయ్య ఈ రోజు హైదరాబాదులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1983 నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఆరుసార్లు పోటీ చేసి ఐదుసార్లు గెలిచారు. కేవలం ఒకసారి మాత్రం 2004లో ఓటమిపాలయ్యారు. తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన తాజాగా మరోసారి టీడీపీలో చేరారు.