: యూఏఈలో ఐపీఎల్ ఏమంత సురక్షితం కాదు!


భారత్ లో ఎన్నికలు జరగనుండడంతో ఐపీఎల్-7 తొలి దశను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, లీగ్ ను అవినీతి రహితం చేస్తామని చెబుతున్న భారత క్రికెట్ బోర్డు యూఏఈలో తొలి దశ నిర్వహించనుండడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. యూఏఈ ఫిక్సింగ్ కు ఆయువుపట్టు లాంటిదని ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. అక్కడ టోర్నీ జరపాలనుకోవడం కొరివితో తలగోక్కోవడంలాంటిదే.

షార్జాలో ఇంతకుముందు జరిగిన క్రికెట్ టోర్నీలను ఓసారి పరికిస్తే, డ్రెస్సింగ్ రూంలలోకి దావూద్ ఇబ్రహీంలాంటి మాస్టర్ గేంబ్లర్ లు రావడం సర్వసాధారణం. పైగా, మాజీ కెప్టెన్ అజహరుద్దీన్, నయన్ మోంగియా, అజయ్ జడేజా వంటి క్రికెటర్లు ఫిక్సింగ్ మకిలి అంటించుకుంది ఇక్కడే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పోటీలు ఇక్కడ జరపాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఫిక్సింగ్ రహిత క్రికెట్ ప్రపంచాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తుందో పెద్దలకే తెలియాలి. ప్రజలను విశేషంగా ఆకర్షించే ఐపీఎల్ పోటీలు ఇక్కడి బెట్టింగ్ ముఠాలకు కాసులవర్షం కురిపిస్తాయనడంలో సందేహం అక్కర్లేదు.

  • Loading...

More Telugu News