: నెపోలియన్ ఉంగరం ధర అంతా...?
ఫ్రాన్స్ సార్వభౌముడు నెపోలియన్ బోనపార్టే గొప్పతనం అందరికీ తెలిసిందే. ఈ
ధీరుడు 1796లో అతని మొదటి భార్యకిచ్చిన ఎంగేజ్ మెంట్ ఉంగరం తాజాగా వేలంలో కళ్ళు
చెదిరే ధరకు అమ్ముడుపోయి సంచలనం సృష్టించింది. ఒసెనట్ అనే సంస్థ ఆదివారం
నాడు ఫ్రాన్సులో ఈ ఉంగరాన్ని వేలం పెట్టింది. ఇది పదిలక్షలకు
అమ్ముడుపోతుందని నిర్వాహకులు మొదట భావిస్తే ... ఏకంగా
5కోట్ల 20 లక్షల రూపాయలకు పైగా అమ్ముడుపోయి అందర్నీ విస్మయానికి
గురిచేసింది.
తొలుత అధికారిగా ఉన్న సమయంలో నెపోలియన్, భార్య అయిన జోసెఫిన్ డి బ్యుహర్నైస్ కు ఈ ఉంగరం చేయించాడట. ఆమె మీద ఉన్న ప్రేమతో తనకున్న సంపదలో చాలా మొత్తం ఈ ఉంగరం కోసం నెపోలియన్ ఖర్చుచేసాడని ఒసెనట్ సంస్థకు చెందిన జీన్ అంటున్నారు. జోసెఫైన్ 250వ జయంతి సందర్భంగా ఈ వేలం నిర్వహించారు.