: టీడీపీని చిత్తుగా ఓడించాలంటున్న ఒవైసీ


తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతోందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మతతత్వ పార్టీలతో అంటకాగే ఏ పార్టీకైనా ప్రజలే బుద్ధి చెబుతారని ఒవైసీ అభిప్రాయపడ్డారు. ఇక, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపైనా విరుచుకుపడ్డారు. గుజరాత్ లో అల్లర్లకు కారణమైన మోడీ హైదరాబాద్ వస్తే తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.

రాష్ట్ర విభజనపై వ్యాఖ్యానిస్తూ చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం, జగన్ కపట రాజకీయాల కారణంగానే రాష్ట్రం విడిపోయిందని సూత్రీకరించారు. అయితే, హైదరాబాద్ ను విడిచి వెళ్ళమని సీమాంధ్రులను హెచ్చరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News