: తుపాకీ పేలి ఎస్సైని బలిగొంది
ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఎస్సైని బలిగొంది. విజయవాడలో తుపాకి మిస్ ఫైర్ అయి ఓ వ్యక్తి గాయపడ్డ విషయం మర్చిపోకముందే మరో ఘటన ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. కాంకేర్ జిల్లా భానుప్రతాప్ గ్రామం వద్ద ఓ బస్సులో ప్రయాణిస్తున్న ఎస్సై దగ్గరున్న రివాల్వర్ పొరపాటున పేలింది. బుల్లెట్ నేరుగా ఎస్సైకి తగలడంతో ఎస్సై అక్కడికక్కడే మృతి చెందాడు. సాధారణంగా రివాల్వర్ లాక్ రిలీజ్ చేస్తేనే పేలుతుంది. తుపాకీని ఎప్పుడూ లాకింగ్ పొజిషన్ లోనే ఉంచుతారు. బుల్లెట్లు లోడ్ చేసేప్పుడు, శుభ్రం చేసేటప్పుడు మాత్రమే లాక్ ను తీసేస్తారు. అయితే బస్సులో ట్రిగ్గర్ ఒత్తుకుని రివాల్వర్ పేలి ఉంటుందని నిపుణులు అంచనావేస్తున్నారు.