: 'నిర్భయ' కేసులో ఉరిశిక్షను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
సంచలనం సృష్టించిన 'నిర్భయ' కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్షను వేయడాన్ని న్యాయస్థానం సమర్థించింది. నిర్భయ కేసులో నిందితులైన ఆ నలుగురికి సెప్టెంబర్ 13, 2013న ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై నిందితులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.