: సైనా శుభారంభం


భారత బ్యాడ్మింటన్ అగ్రగామి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ స్విస్ ఓపెన్ టోర్నీలో శుభారంభం చేసింది. తొలి రౌండ్ లో ఆరో సీడ్ సైనా 21-12, 21-12తో జపాన్ కు చెందిన చిసాటో హోషిని వరుస గేముల్లో చిత్తు చేసింది. సైనా రెండో రౌండ్ లో సాషినా విగ్నెస్ (ఫ్రాన్స్)తో తలపడనుంది.

ఇక పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్, ఆనంద్ పవార్ మూడో రౌండ్ కు దూసుకెళ్ళారు. కశ్యప్ 21-15, 21-14తో లూకాస్ ష్మిట్ (జర్మనీ)ను మట్టికరిపించాడు. పవార్ 21-11, 21-4తో టొబియాస్ వదెంకా (జర్మనీ)పై ఘనవిజయం సాధించాడు. స్విట్జర్లాండ్ లోని బసెల్ లో ఈ చాంపియన్ షిప్ జరుగుతోంది.

  • Loading...

More Telugu News