: పవన్ పెట్టే కొత్త పార్టీ పీఆర్పీలా మారుతుందేమో!: ఆనం
నటుడు పవన్ కల్యాణ్ పెట్టబోయే కొత్త పార్టీపై మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి స్పందించారు. పవన్ పెట్టే కొత్త పార్టీ పీఆర్పీలా మారుతుందేమోనని వ్యాఖ్యానించారు. అయితే, కుటుంబ నేపథ్యాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని చెప్పారు. ఇదే సమయంలో జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన ఆనం, 2011లో శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుదామని సోనియా చెబితే కిరణ్ అడ్డుపుల్ల వేశారని ఆరోపించారు. మూడేళ్లు అధికారం అనుభవించి కిరణ్ విభజనకు కారకుడయ్యాడన్నారు. హర్షకుమార్, సాయిప్రతాప్ సమైక్య ముసుగులో కిరణ్ పార్టీలో చేరి మోసపోయారని ఎద్దేవా చేశారు.