: నేను అన్నయ్యతోనే ఉంటా... పార్టీ పెట్టుకోవడం కల్యాణ్ ఇష్టం: నాగబాబు


పవన్ కల్యాణ్ కొత్త పార్టీ ప్రారంభానికి ఘడియలు ముంచుకొస్తున్న వేళ ఆయన సోదరుడు నాగబాబు స్పందించారు. కల్యాణ్ పార్టీ పెట్టుకోవడమనేది ఆయన సొంత నిర్ణయమని చెప్పారు. తన ఇష్టం మేరకు పార్టీ పెట్టుకుంటున్నాడని అన్నారు. అయితే, తనతో పాటు మెగా అభిమానులందరం అన్నయ్య వెంటే ఉంటామని స్పష్టం చేశారు. తనకు, కల్యాణ్ కు, రాంచరణ్ కు అన్నయ్య చిరంజీవి బంగారు బాట వేశారని చెప్పారు. మా అందరికీ అన్నయ్య వల్లే గుర్తింపు వచ్చిందని అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో అన్నయ్యను వీడనని వెల్లడించారు.

  • Loading...

More Telugu News