: విజయసాయిరెడ్డి బెయిల్ పై ఆంక్షలు సడలింపు


జగన్ అక్రమాస్తుల కేసులో కీలక నిందితుడిగా సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న విజయసాయి రెడ్డి బెయిల్ పై గతంలో విధించిన ఆంక్షలను కోర్టు నేడు సడలించింది. తాజా ఉత్తర్వులతో ఈ నెల 27 నుంచి జూన్ 10 వరకు విజయసాయి బెయిల్ పై ఆంక్షలు ఎత్తివేస్తారు. జగతి పబ్లికేషన్స్ కు వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న విజయసాయి తన కుమార్తె వివాహాన్ని పురస్కరించుకుని బెయిల్ పై ఆంక్షలు తొలగించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయి అభ్యర్థనను పరిశీలించిన కోర్టు సానుకూలంగా స్పందించింది. 

  • Loading...

More Telugu News