: పవన్ కల్యాణ్ అందంగా ఉంటాడు... అంతకు మించి ఇంకేమీ తెలియదు: సీపీఐ నారాయణ


సినీ నటుడు పవన్ కల్యాణ్ అందంగా ఉంటాడనీ, అంతకు మించి అతని గురించి తనకు ఇంకేమీ తెలియదని సీపీఐ నారాయణ అన్నారు. హైదరాబాదులో మగ్ధూం భవన్ లో ఆయన మాట్లాడుతూ, పవన్ పై అలా కామెంట్ చేశారు. వామపక్ష పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో కలసి పోటీ చేసేందుకు నిర్ణయించాయని అన్నారు. దీంతో చాలా కాలం తరువాత వామపక్ష పార్టీలు రెండూ కలసి ఎన్నికల బరిలో నిల్చుంటున్నాయి. గతంలో కాంగ్రెస్ తో ఒక పార్టీ, టీడీపీతో ఒక పార్టీ జత కలసి ఎన్నికల బరిలో దిగాయి.

  • Loading...

More Telugu News