: సడక్ బంద్ కేసులో మరో ముగ్గురికి బెయిల్


సడక్ బంద్ సందర్భంగా అరెస్టయిన మరో ముగ్గురు తెలంగాణ నేతలకు ఇవాళ బెయిల్ మంజూరైంది. కోదండరామ్, ఈటెల రాజేందర్ సహా మొత్తం 8మందికి  శనివారం ఆలంపూర్ కోర్టు 10వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో మిగిలిన మరో ముగ్గురు టీఆర్ఎస్ నేతలకూ ఇవాళ బెయిల్ లభించింది. వీరిలో ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, టీఆర్ఎస్ నేతలు గట్టు తిమ్మప్ప, రవికుమార్ ఉన్నారు.

  • Loading...

More Telugu News