: సారపాక ఐటీసీ పేపర్ మిల్లులో ప్రమాదం
ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలోని సారపాకలో ఉన్న ఐటీసీ పేపరు మిల్లులో ఈ తెల్లవారు జామున ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు గాయపడ్డారు. పేపరు గుజ్జు ప్రమాదవశాత్తూ కార్మికులపై పడింది. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.