: కిరణ్, కేసీఆర్, జగన్ లపై చంద్రబాబు విసుర్లు
తెలంగాణలో కూడా టీడీపీనే విజయం సాధిస్తుందని చంద్రబాబు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఫాంహౌస్ లో కేసీఆర్ పండించే పంట అవినీతి పంట అని విమర్శించారు. ఎవరైనా ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తారా? అంటూ ప్రశ్నించారు. వైకాపా అధినేత జగన్ ఏకంగా లక్ష కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు. మాజీ సీఎం కిరణ్ ఏనాడైనా ప్రజల్లోకి వచ్చి వారి సమస్యలు తెలుసుకున్నారా? అంటూ ప్రశ్నించారు. విశాఖను ఐటీ హబ్ గా మారుస్తానని... సీమాంధ్రలో బ్రహ్మాండమైన రాజధానిని నిర్మిస్తానని హామీ ఇచ్చారు.