: చంద్రబాబు, జగన్ లపై విరుచుకుపడ్డ కిరణ్
రాష్ట్ర విభజనతో తెలంగాణకే ఎక్కువ నష్టమని జేఎస్పీ నేత కిరణ్ చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణను విద్యుత్ సమస్య పీడిస్తుందని తెలిపారు. 80 శాతం మంది ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రాజమండ్రిలో జరుగుతున్న పార్టీ తొలి సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు, జగన్ లపై విమర్శల వర్షం కురిపించారు. 45 రోజుల పాటు అసెంబ్లీ జరిగితే... చంద్రబాబు ఒక రోజు కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పలేదని విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. జగన్ గురించి మాట్లాడుతూ, ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించవచ్చని చెప్పింది ఆయనే అని... ఇప్పుడు మళ్లీ సమైక్యం అంటున్నారని విమర్శించారు. జగన్ కు సమైక్య రాష్ట్రం ముఖ్యం కాదని... సీఎం పదవి, కేసుల నుంచి బయటపడటమే ముఖ్యమని ఆరోపించారు.