: గత ప్రభుత్వాలన్నీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాయి: ఈటెల
వామపక్షాల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ తర్వాత తోక పార్టీలని విమర్శిస్తున్నాయని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. ఇవాళ టీఆర్ఎస్ నేతలు ఈటెల, భిక్షపతి వామపక్షాలు చేస్తోన్న విద్యుత్ దీక్ష శిబిరాన్ని సందర్శించి పార్టీ తరపున సంఘీభావం తెలిపారు. గత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు బషీర్ బాగ్, ముదిగొండ కాల్పుల పేరిట ప్రజల ప్రాణాలు బలిగొన్నాయని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై వామపక్షాలతో కలిసి పోరాడతామని ఈటెల ప్రకటించారు.