: విద్యార్థులకు మోడీ సందేశం


'మీరే కాదు, నేనూ పరీక్షలు రాయబోతున్నాను' అంటూ గుజరాత్ లోని టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్థులను ఉద్దేశించి సీఎం నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. 'విద్యార్థులుగా మీరు ఎలా పరీక్షలకు సన్నద్ధమయ్యారో, నేనూ ఎన్నికలనే పరీక్షల కోసం సిద్ధంగా ఉన్నాను' అని పేర్కొన్నారు. రేపటి నుంచి గుజరాత్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలు జరగనుండగా, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆశ్చర్యకరమైన రీతిలో మోడీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ప్రీ రికార్డెడ్ కాల్ ద్వారా ఆయన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్థులు తల్లిదండ్రులు కాల్ రిసీవ్ చేసుకోగానే... 'విద్యార్థి స్నేహితులారా, నేను నరేంద్ర మోడీని. మీలాగే నేనూ పరీక్షలకు ప్రిపేరయ్యాను. మీరూ నాలాగే పరీక్షలంటే భయపడకూడదు. జీవితంలో కూడా పరీక్షలు ఉంటాయి, మన కఠోర శ్రమ మనకు సత్ఫలితాలను ఇస్తుంది. ఈ పరీక్షల్లో మీరు మంచి ర్యాంకు తెచ్చుకోవాలి. మరోసారి మీకు శుభాకాంక్షలు' అంటూ చిరు సందేశం వినవచ్చింది. దీనిపై, ఓ విద్యార్థి తండ్రి మాట్లాడుతూ, మోడీ నుంచి నా కుమారుడి కోసం ఫోన్ రాగానే ఆశ్చర్యపోయానని తెలిపాడు. విద్యార్థుల్లానే తానూ పరీక్షలకు సిద్ధమవుతున్నానని మోడీ చెప్పడం మనసుకు హత్తుకుందని చెప్పాడు.

  • Loading...

More Telugu News