: మలేసియా విజ్ఞప్తికి ఓకే చెప్పిన భారత్
కనిపించకుండా పోయిన విమానం కోసం గాలింపు చర్యల్లో పాలుపంచుకోవాలంటూ మలేసియా చేసిన విజ్ఞప్తిని భారత్ మన్నించింది. ఈమేరకు భారత వాయుసేన డోర్నియర్ విమానాన్ని సిద్ధం చేసింది. ఈ భారీ విమానంతో పాటు ఎంఐ-17 హెలికాప్టర్లు కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటాయి. అవసరమైతే నేవీకి చెందిన పి-81, టియు-142 నిఘా విమానాలను కూడా రంగంలోకి దింపాలని భారత్ నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే గాలింపు చర్యలు ఆరంభిస్తామని వాయుసేన అధికారులు తెలిపారు. కాగా, భారత విమానాలు అండమాన్ నికోబార్ దీవుల నుంచి మలక్కా జలసంధి వరకు గాలింపు చేపట్టే అవకాశముంది.