: ప్రారంభమైన జై సమైక్యాంధ్ర పార్టీ సభ
రాజమండ్రిలోని జెమినీ గ్రౌండ్స్ లో జై సమైక్యాంధ్ర పార్టీ తొలి సభ ప్రారంభమైంది. పార్టీ అధినేత కిరణ్, ఇతర నేతలు లగడపాటి, హర్షకుమార్, ఉండవల్లి, తులసిరెడ్డి, తదితరులు సభావేదికను అలంకరించారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలతో జెమినీ గ్రౌండ్స్ కిక్కిరిసిపోయింది. సభా స్థలి అంతా పార్టీ రంగు ఆకుపచ్చ కలర్ తో నిండిపోయింది.