: కౌన్సిలర్ పదవికి హిజ్రా నామినేషన్


కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు కౌన్సిలర్ పదవికి ఓ హిజ్రా నామినేషన్ దాఖలు చేశారు. కడప జిల్లాకు చెందిన షేక్ సమీరా బీఎస్సీ హోంసైన్స్ చదివారు. నంద్యాలలో స్థిరపడిన సమీరా సమతా హిజ్రాల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు.

నంద్యాలలోని 6వ వార్డులో 85 మంది హిజ్రాలకు ఓటుహక్కు ఉంది. అన్ రిజర్వు వార్డు కావడంతో మంగళవారం షేక్ సమీరా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం సమీరా మీడియాతో మాట్లాడుతూ... బాల్యం నుంచి ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్నానని అన్నారు. తామూ అందరిలా మనుషులమని చాటేందుకే పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News