: నీతికి, నిజాయతీకి మారు పేరు ఎల్లారెడ్డి: కేసీఆర్
టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఎల్లారెడ్డిని కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. నీతి, నిజాయతీకి ఎల్లారెడ్డి మారుపేరని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. మక్తల్ నియోజకవర్గంలో ఎల్లారెడ్డికి మంచి పేరు ఉందని అన్నారు. అలాగే టీఆర్ఎస్ లో చేరిన విద్యార్థి నేత పిడమర్తి రవిని మంచి (గెలుపొందే) స్థానంలో నిలబెడతామని చెప్పారు. ఎల్లారెడ్డి కోసం సీటు వదులుకున్న దేవర మల్లప్పకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.