: మోడీ ఎక్కడి నుంచి బరిలో దిగుతారో రేపు తెలుస్తుంది


లోక్ సభకు భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ సస్పెన్స్ రేపు తొలగిపోనుంది. సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి బరిలోకి దిగుతారా? లేక ఉత్తరప్రదేశ్ నుంచి మోడీ పోటీ చేస్తారా? అనేది గురువారం తేలిపోతుంది. ఆయనెక్కడ పోటీ చేస్తారనేది రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించనుంది. రెండు స్థానాల నుంచి మోడీ పోటీ చేసే విషయంపై కూడా రేపు స్పష్టత ఇవ్వనుంది.

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి స్థానం నుంచి లోక్ సభకు మోడీ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మోడీ కోసం తన స్థానానికి ఎసరు పెట్టడం ఏమిటని అక్కడి సిట్టింగ్ ఎంపీ మురళీ మనోహర్ జోషీ ప్రశ్నిస్తున్నారు. కాగా, గుజరాత్ వెలుపల మోడీ పోటీ చేస్తే ఆయనపై పోటీ చేసేందుకు సిద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News