: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో విచారణ
స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడం కష్టతరమని రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టును కోరింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు వాదనలు విన్న కోర్టు... ఇబ్బందులను లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించింది. ఎల్లుండిలోగా అభ్యర్థనను దాఖలు చేయాలని కోరింది.