: ఐపీఎల్ ఫ్రాంచైజీలతో జట్టుకట్టిన పెప్సీ
కాసుల వర్షం కురిపించే టి20 క్రికెట్ టోర్నీ ఐపీఎల్ తాజా సీజన్ లో బహుళజాతి శీతలపానీయాల సంస్థ పెప్సీ ఎనిమిది ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఆయా ఫ్రాంచైజీలు సొంతగడ్డపై ఆడే మ్యాచ్ లపై పెప్సీ కి హక్కులు ఉంటాయి. ఆ సమయంలో ఆయా జట్ల ఆటగాళ్ళు పెప్సీ ఉత్పత్తుల లోగోలను ధరించడంతో పాటు ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనాల్సి ఉంటుంది.
డిఫెండింగ్ చాంప్ కోల్ కతా నైట్ రైడర్స్ తో పాటు ఢిల్లీ డేర్ డెవిల్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పుణే వారియర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్లు పెప్సీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాగా, ఐపీఎల్ ఆరవ సీజన్ ఏప్రిల్ 3న ఆరంభం కానుంది.