: ఫిక్స్ డ్ లైన్ ఇంటర్నెట్ రేట్లు పెంచిన ఎయిర్ టెల్


అగ్రగామి మొబైల్ సర్వీసుల ఆపరేటర్ ఎయిర్ టెల్ తన ఫిక్స్ డ్ లైన్ ఇంటర్నెట్ రేట్లు పెంచింది. క్రితం కంటే 40 శాతం అదనంగా చార్జీలు వసూలు చేయనుంది. రూ.250 ప్లాన్ ఖాతాదారులు ఇకపై నెలకు రూ.349 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఏప్రిల్ 17 నుంచి అమల్లోకి వస్తుంది. ఇక, ఇప్పటివరకు రూ.850 అద్దె చెల్లిస్తున్న వాళ్ళు ఇకపై రూ.949 చెల్లించక తప్పదు. ఇది ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వస్తుంది.

అంతేగాకుండా, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించే క్రమంలో బ్రాడ్ బ్యాండ్ కనీస వేగాన్ని 256 కేబీపీఎస్ నుంచి 512 కేబీపీఎస్ కు పెంచాలని ఎయిర్ టెల్ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎయిర్ టెల్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ, మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే టారిఫ్ నిర్ణయిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News