: టీడీపీ మళ్లీ అధికారంలోకి రాదు.. రాదు.. రాదు.. : బొత్స
కేవలం అధికార దాహంతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై టీడీపీ లేనిపోని ఆరోపణలు చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. శాసనసభలో టీడీపీ నేతల తీరును ఆయన తప్పుబట్టారు. సభలో టీడీపీ నేతలు.. పాదయాత్రలో చంద్రబాబు ఎన్ని కట్టుకథలు చెప్పినా ప్రజలు విశ్వసించరని ఆయన తెలిపారు. అధికారదాహంతోనే తెలుగుదేశం పార్టీ ఈ చర్యలకు పాల్పడుతోందని, ఎంత శ్రమించినా, ఎన్ని అబద్ధాలాడినా.. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాదు.. రాదు..రాదు.. అంటూ బొత్స పదేపదే స్పష్టం చేశారు.