: వామపక్షాల విద్యుత్ దీక్షకు టీడీపీ నేతల సంఘీభావం


విద్యుత్ చార్జీలకు నిరసనగా ఇందిరాపార్క్ వద్ద వామపక్షాలు చేస్తోన్న `విద్యుత్ దీక్ష`కు టీడీపీ నేతలు మద్దతు పలికారు. మోత్కుపల్లి నర్శింహులు, దేవినేని ఉమ, పరిటాల సునీత, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితర 20 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. 
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను బ్రష్టు పట్టించిందంటూ మోత్కుపల్లి  ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. కమిషన్ల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విద్యుత్ ప్రాజక్టులను ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారని విమర్శించారు. ఈ అక్రమ సొమ్ముతో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లో జగన్ కు విద్యుత్ ప్రాజక్టులు వచ్చేలా చేశారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News