: టీడీపీలో చేరే సన్నాహాల్లో వైరా ఎమ్మెల్యే


ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బానోతు చంద్రావతి సీపీఐని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె టీడీపీలో చేరబోతున్నట్లు సన్నిహితులు, పార్టీ వర్గాల నుంచి సమాచారం బయటకు వచ్చింది. 2009లో కొత్తగా ఏర్పాటైన వైరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా చంద్రావతి విజయం సాధించారు. ఎంబీబీఎస్ చదివిన చంద్రావతికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా సీపీఐ అభ్యర్థిగా నిలబెట్టింది. కానీ, ఈసారి ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ సుముఖంగా లేదని సమాచారం. పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా లేకపోవడంతో ఆమెకు టికెట్ ఇచ్చేందుకు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ విముఖంగా ఉన్నారని, దీంతో చంద్రావతి అసహనంతో పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News