: తిరుమలలో నేటి నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు, ఆర్జిత సేవలు రద్దు
తిరుమలలో ఇవాళ్టి (బుధవారం) నుంచి 16వ తేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు స్వామి వారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతాయి. తెప్పోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో ఈ ఐదు రోజుల పాటు వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర ఆర్జిత సేవలు రద్దయ్యాయి. తెప్పోత్సవంలో భాగంగా ఈ రోజు రాత్రి 7 గంటలకు శ్రీకృష్ణుని అవతారంలో స్వామి వారు తెప్పలపై విహరించనున్నారు.