: జాతీయ పార్టీల మద్దతు మాకవసరంలేదు: కరుణానిధి
వచ్చే ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి. జాతీయ పార్టీల మద్దతును డీఎంకే కోరుకోవడం లేదని తెలిపారు. స్థానిక మిత్రుల సాయంతో గెలిచే సత్తా డీఎంకే పార్టీకి ఉందని స్పష్టం చేశారు. చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో మొత్తం 39 లోక్ సభ స్థానాలున్నాయి. పొరుగున ఉన్న పుదుచ్చేరిలో ఒక లోక్ సభ స్థానముంది. వాటిలో 35 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన డీఎంకే మిగతా ఐదు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. వీసీకే పార్టీకి 2, ఎంఎంకే, ఐయూఎంల్, పుదియ తమిళగం పార్టీలకు ఒక్కొక్క స్థానం చొప్పున కేటాయించింది.