: ఎన్నికల్లో ఫిర్యాదుల కోసం జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్
హైదరాబాదు జిల్లాకు సంబంధించిన ఎన్నికల ఫిర్యాదుల కోసం జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ ఫోన్ నెం. 040-21111111. ఎన్నికల కోసం 3,091 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాదు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ బొజ్జా తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 16 వేల ఈవీఎంలను వినియోగిస్తామని, 30 వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు.