: రైల్వే స్కాంలో మాజీ రైల్వే మంత్రి మేనల్లుడిపై అభియోగాలు


గతేడాది రైల్వే శాఖలో సంచలనం సృష్టించిన 'క్యాష్ ఫర్ జాబ్' కుంభకోణంలో సీబీఐ చార్జ్ షీటు దాఖలు చేసింది. రైల్వే శాఖ మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సల్ మేనల్లుడు విజయ్ సింగ్లా, రైల్వే బోర్డు సభ్యుడు మహేశ్ కుమార్, మరో ఎనిమిది మంది పై 'ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్', 'క్రిమినల్ కాన్స్పిరసీ' కింద అభియోగాలు నమోదు చేసింది. పదోన్నతి కోసం మహేశ్ కుమార్ విజయ్ సింగ్లాకు రూ.10 కోట్లు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఈ కేసులో విచారణ ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతుందని కోర్టు తెలిపింది.

  • Loading...

More Telugu News