: రేపిస్టును దారుణంగా హతమార్చిన చైనా మహిళ
మహిళ తెగిస్తే... మగవాడెంత! అన్న విషయాన్ని నిరూపించేందుకా అన్నట్టు ఈ చైనా మహిళ విశ్వరూపం ప్రదర్శించింది. వివరాల్లోకెళితే... యెంగ్ కి (41) అనే చైనా మహిళ హాంకాంగ్ లో నివసిస్తోంది. ఆమె స్థానిక పియానో టీచర్ ఝౌ హుయితో కొన్నాళ్ళుగా అక్రమసంబంధం నెరుపుతోంది. అతగాడికి పెళ్ళయింది. అయితే, యెంగ్ గర్భవతి కావడంతో ఆమెను నిర్లక్ష్యం చేయసాగాడు. అంతేగాకుండా ఆమె వద్ద తీసుకున్న డబ్బును తిరిగివ్వకుండా ఇబ్బందులు పెట్టేవాడు.
ఓరోజు ఝౌ ఆమెను తీవ్రంగా కొట్టి, నిరాకరిస్తున్నా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో, అతణ్ణెలాగైనా హతమార్చాలని భావించిన యెంగ్ నిద్రమాత్రలతో అతడిని మత్తులో ముంచి అతడి పురుషాంగాన్ని కత్తిరించి వేసింది. బాధతో విలవిల్లాడుతూ పైకిలేచిన అతడిని సుత్తితో అదే పనిగా మోదింది. దీంతో, ఝౌ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న హాంకాంగ్ పోలీసులు యెంగ్ ను అరెస్టు చేశారు.