: కృష్ణ జింకలను సల్మాన్ కాల్చడం చూశాను: మాజీ ఫారెస్ట్ ఆఫీసర్


పదహారేళ్ల నాడు రాజస్థాన్ లోని కన్ కనీ గ్రామంలో రెండు కృష్ణ జింకలను చంపిన కేసులో నటుడు సల్మాన్ ఖాన్ మరింత ఇబ్బందిలో పడ్డట్లు కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి నేడు జోధ్ పూర్ లోని ఎస్ జేఎం కోర్టు విచారణ చేపట్టినప్పుడు అప్పటి ఫారెస్ట్ అసిస్టెంట్ ఆఫీసర్ అయిన భన్వర్ లాల్ కీలక విషయాలు వెల్లడించారు. కృష్ణ జింకల వైపు సల్మాన్ తుపాకి ఎక్కుపెట్టి ట్రిగ్రర్ నొక్కడం తాను చూశానని వెల్లడించాడు. గాయాలతో వాటి మెడపై రక్తపు మరకలు ఉండటం కూడా చూసినట్లు కోర్టుకు వివరించాడు. అతను చెప్పిన దాన్ని కోర్టు నమోదు చేసుకుంది. అనంతరం విచారణను వాయిదా వేసింది. 1998 అక్టోబర్ లో జరిగిన ఈ ఘటనపై వెంటనే కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News