: తగ్గిన పీపీఎఫ్, ఎన్ఎస్ సీ వడ్డీ రేట్లు


ప్రజా భవిష్యనిధితోపాటు, పోస్టల్ శాఖకు చెందిన పలు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)పై ఇప్పటి వరకూ 8.8 శాతం వడ్డీ చెల్లిస్తుండగా.. దానిని 8.7కు కుదించారు. అలాగే జాతీయ పొదుపు పత్రం (ఎన్ఎస్ సీ)పై 8.6 శాతం వడ్డీ ఇస్తుండగా.. అది 8.5శాతానికి తగ్గింది. ఐదేళ్ల పోస్టల్ రికరింగ్ డిపాజిట్ రేటును కూడా 8.3శాతానికి తగ్గించారు. పోస్టల్ సేవింగ్ డిపాజిట్లపై 4శాతం వడ్డీలో ఎలాంటి మార్పూ లేదు. అలాగే ఏడాది కాలవ్యవధిలోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా మార్చలేదు. 

  • Loading...

More Telugu News