: స్టేషన్ ఘన్ పూర్ సీటు కోసం టీఆర్ఎస్ నేతల మధ్య పోటీ
వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ సీటు కోసం టీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య అనుచరుల మధ్య పోటీ ఏర్పడింది. సీటును తమ నేతకే కేటాయించాలంటూ ఇరు వర్గాల మధ్య వివాదం ఏర్పడింది. అయితే, రాజయ్యను వరంగల్ ఎంపీ స్థానానికి పంపాలని కడియం అనుచరులు తీర్మానం చేయగా, ఘన్ పూర్ సీటును వదలొద్దని అటు రాజయ్య అనుచరులు పట్టుబడుతున్నారు. చివరికి అధినేత కేసీఆర్ ను కలవాలని ఇద్దరు నేతల అనుచరులు నిర్ణయించారు.