: మలేసియా విమానం కోసం గాలింపు చర్యలు ముమ్మరం


మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళుతూ అదృశ్యమైన మలేసియన్ ఎయిర్ లైన్స్ విమానం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిన్నటి దాకా అగ్రరాజ్యం అమెరికా సహా మొత్తం పది దేశాలు ఆచూకీ లేకుండా పోయిన విమానం కోసం అన్వేషణ సాగించాయి. పది నౌకలు, 22 విమానాలు గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. వీటికి తోడు తాజాగా చైనా కూడా రంగంలోకి దిగింది.
< విమాన శకలాలను కనుగొనేందుకు చైనా 10 ఉపగ్రహాల సహాయం తీసుకుంటోంది. ఈ చైనా శాటిలైట్లకు భూమి ఉపరితలాన్ని హై రిజల్యూషన్ తో చిత్రీకరించే సామర్థ్యముంది. కాగా, గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని చైనా నేడు మలేసియా ప్రభుత్వాన్ని కోరింది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 227 మంది ప్రయాణికుల్లో మూడింట రెండొంతులు చైనీయులే.
<తొలుత ఈ విమానం వియత్నాం సముద్రంలో కూలిపోయిందని వార్తలొచ్చాయి. అయితే, అక్కడ కూలిపోయినట్టు ఆధారాలేమీ లభ్యం కాకపోవడంతో ఈ ఉదంతం కాస్తా మిస్టరీగా మారింది.

  • Loading...

More Telugu News